పవర్ స్టారా మజాకా…16 గంటలు ట్రెండింగ్…ఒకేఒక్కడు

0
441

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి ఏమాత్రం సంభందం లేకుండా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోయే హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. బాక్స్ ఆఫీస్ దగ్గర అత్తారింటికి దారేది తర్వాత నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన (అజ్ఞాతవాసి) తో సంక్రాంతి బరిలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని కొద్ది సేపట్లో రిలీజ్ కాబోతుండగా రిలీజ్ కి 16 గంటల ముందు నుండే సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ పవర్ స్టార్ అభిమానులు ఓ రేంజ్ లో సంచలనం సృష్టిస్తూ సోషల్ మీడియా లో దుమ్ము లేపుతున్నారు.

కాగా 16 గంటలు ట్రెండ్ అయిన pspk25firstlook హాష్ టాగ్ ఇప్పటికే 68 వేల ట్వీట్స్ కి పైగా సొంతం చేసుకుంది. ఇలా పవన్ సోషల్ మీడియా లో తనకి ఉన్న క్రేజ్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేస్తూ దూసుకు పోతున్నాడు. కాగా సినిమా టైటిల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్వచ్చాకా మరింత జోరు చూపాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఆ రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here