PSV గరుడ వేగ 2 రోజుల కలెక్షన్స్ అప్ డేట్…దిమ్మతిరిగే షాక్ ఇది

0
3133

మంచి సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే మంచి టాక్ రావాలి…ఒక్కో సారి మంచి టాక్ వచ్చినా పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన PSV గరుడ వేగ సినిమా పరిస్థితి ఇలానే ఉంది అని చెప్పొచ్చు. మొదటి ఆటకే యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావడం లేదని సమా చారం.

మొదటి రోజు సినిమా 1.5 కోట్ల మార్క్ ని అందుకుంది అనుకున్నా ఓవరాల్ గా అఫీషియల్ షేర్ 1 కోటి రెండు రాష్ట్రాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది. కానీ సినిమా రెండో రోజు పుంజుకున్నా మొత్తం మీద 1.2 కోట్ల షేర్ లోపే ముగించడం కొంత విచారకరం.

థియేటర్స్ చాలా తక్కువగా ఉండటం ఒక రీజన్ అయితే ప్రేక్షకులలో ఇలాంటి సినిమాలు ఇష్టపడే వారు తక్కువ అవ్వడం ఒక కారణం అవ్వొచ్చు. మంచి సినిమా టాక్ అందరికీ చేరి ఎక్కువమంది సినిమా చూస్తె బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రయత్నానికి బరోసా ఇచ్చినట్లు అవుతుంది. మరి తెలుగు ఆడియన్స్ ఈ సినిమా విషయం లో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here