PSV గరుడ వేగ…రియల్ బడ్జెట్…బిజినెస్—కలెక్షన్స్ డీటైల్స్

0
3765

   సీనియర్ హీరో రాజశేఖర్ తో ప్రస్తుతం సినిమా చేయడానికి టాలీవుడ్ లో దర్శకులు నిర్మాతలు ముందుకు వస్తున్నారు… ఇలా జరగడానికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న PSV గరుడ వేగ సినిమానే అని చెప్పొచ్చు. రాజశేఖర్ కి రీ లాంచ్ లా మారిన ఈ సినిమా తో అన్ని చోట్లా రాజశేఖర్ పై ప్రశంసల జల్లు కురుస్తుండగా సినిమా అసలు బడ్జెట్ బిజినెస్ కలెక్షన్స్ ఎంత అనేది ఆసక్తి గా మారింది.

కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమాకు అయిన బడ్జెట్ అక్షరాలా 24 కోట్లు…అని తెలుస్తుంది…కాగా సినిమాను ఇదే రేంజ్ బిజినెస్ జరగలేదు. చాలా ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురు అవ్వగా రాజశేఖర్ జీవితలు అదే చేశారు.

దాంతో అన్నీ కలిసి సినిమా థియేట్రికల్ వాల్యూ సుమారు 11 కోట్ల నుండి 12 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. కాగా సినిమా ఇప్పటి వరకు సుమారు 5.5 నుండి 6 కోట్ల మధ్యలో షేర్ వసూల్ చేసింది. కాగా చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం తో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావడం లేదు.. ఎంత టాక్ బాగున్నా సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా సగం దూరం వెళ్ళాల్సిందే అని చెప్పొచ్చు. మరి సెకెండ్ వీకెండ్ లో భారీ పోటి లో PSV గరుడ వేగ ఎంతవరకు వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here