PSV గరుడ వేగ…మూవీ రివ్యూ…రేటింగ్…కామన్ ఆడియన్స్ టాక్

4
15383

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా ఓ వెలుగు వెలిగిన హీరో రాజశేఖర్… ఓ రేంజ్ మాస్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ మూవీస్ తో ఫ్యామిలీ ఫ్యాన్స్ కి కూడా సొంతం చేసుకున్న రాజశేఖర్ కి మాస్ హీరోగా ఎవడైతే నాకేంటి… ఫ్యామిలీ హీరోగా గోరింటాకు సినిమాలు నికార్సయిన హిట్లు… ఆ సినిమాల తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాఫ్ అవ్వడం తో ఫేడ్ అవుట్ అయిన రాజశేఖర్ ఇప్పుడు PSV గరుడ వేగ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.

రొటీన్ లవ్ స్టొరీ, చందమామ కథలు లాంటి క్లాస్ మూవీస్ తో పాటు గుంటూరు టాకీస్ లాంటి అడల్ట్ సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన PSV గరుడ వేగ టైటిల్ తోనే అందరినే ఆకట్టుకోగా తర్వాత రిలీజ్ అయిన టీసర్ కి ట్రైలర్ కి అద్బుతమైన రెస్పాన్స్ లభించింది.

నేడు భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…కథ గురించి ఇక్కడ ఎక్కడా లీక్ చెయ్యట్లేదు…ఆ టైటిల్ ఏంటి కథలో ఆ టైటిల్ కి ఉన్న సంభందం ఏంటి అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…కానీ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం…

మొదటి అర్ధభాగం అద్బుతమైన విజువల్స్ తో తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తితో మొదటి అర్ధభాగం ఓ సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ముగిసి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేక్షకులకు ఫస్టాఫ్ ఓ రేంజ్ థ్రిల్ ని కలిగించి సెకెండ్ ఆఫ్ పై ఆశలు ఓ రేంజ్ లో పెంచుతుంది.

కానీ ఫస్టాఫ్ ని దున్నేసిన డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ లో అక్కడక్కడ తడబడటం తో సినిమా స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది…కానీ ఇంతలో సన్నీ లియోన్ సాంగ్ ఊపు నివ్వగా సినిమా క్లైమాక్స్ వైపు ఆసక్తిగా వెళుతుంది. అక్కడ వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకులను సాటిస్ ఫై చేస్తాయి.

భారీ గా ఖర్చుపెట్టినా కొన్ని సినిమాలు ఆ భారీతనం వెండితెరపై కనిపించవు…కానీ PSV గరుడ వేగ విషయంలో ఖర్చు పెట్టిన ప్రతీ పైసా గ్రాండియర్ గా కనిపించడం విశేషం….అదే సినిమాకు ఉన్న ఆకర్షణలో  ప్రధాన ఆకర్షణ అని కూడా చెప్పొచ్చు.

రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకోగా చాలా కాలం తర్వాత సాయికుమార్ డబ్బింగ్ లో రాజశేఖర్ ని చూడటం రాజశేఖర్ పాత సినిమాలను గుర్తు చేసింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా PSV గరుడ వేగ ని రాజశేఖర్ భుజాన మోశాడు.

ఇక హీరోయిన్స్ నటన ఓకే అనిపించే విధంగా ఉండగా సన్నీ లియోన్ ఎక్కువ మార్కులు వేయించుకుంది. విలన్ రోల్ పవర్ ఫుల్ గా ఉంది…మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ పనులను సక్రమంగా నిర్వర్తించారు.

ఇక సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు సరికొత్త కథతో రావడం డానికి భారీ బడ్జెట్ మరియు సీనియర్ హీరో అందునా ఫేడ్ అవుట్ అయిన రాజశేఖర్ ను ఎంచుకోవడం సినిమాపై ఆశలు పెంచాయి.

ఆ ఆశలను చాలావరకు అందుకున్నాడు ప్రవీణ్ సత్తారు. సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు వెళతారు కాబట్టి చూసిన వారు బాగుంది అంటూ బయటికి రావడం ఖాయం…మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ ఉన్న రేంజ్ లో సెకెండ్ ఆఫ్ ఉండి ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని చెప్పొచ్చు.

కానీ సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం కొద్దిగా మైనస్ అయింది…అలాగే ఈ సినిమాకి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేదానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్..మీరు సినిమా చూస్తె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

4 COMMENTS

  1. Movie…is excellent Sir…will u please encourage the team of garudavega movie and think the way making of movie. Don’t give this type of reviews. Thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here