రాజా ది గ్రేట్ 2 వీక్స్ టోటల్ కలెక్షన్స్…క్లీన్ హిట్ కి ఎంత కావాలి?

0
965

  మాస్ మహారాజ్ రవితేజ భారీగా కంబ్యాక్ చేసిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే 20 కోట్లకు పైగా షేర్ తో సంచలనం సృష్టించి మొదటి వారాన్ని 24 కోట్లకు పైగా షేర్ తో ముగించగా రెండో వారం లో సినిమా సేఫ్ జోన్ లో ఎంటర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా అనుకోకుండా స్లో అవ్వడం తో రెండో వారం కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు.

మొత్తం మీద రెండో వారం లో సినిమా 4.5 కోట్ల మేర షేర్ ని అందుకోగా మొత్తం మీద సినిమా 2 వారాల్లో 28.5 కోట్ల మేర షేర్ ని అందుకుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల మేర షేర్ ఉండగా ఒక్క నైజాంలోనే 10.5 కోట్లకు పైగా షేర్ తో సంచలనం సృష్టించింది.

కాగా సినిమా బిజినెస్ 30 కోట్ల రేంజ్ లో జరగడం తో సినిమా 31 కోట్ల మేర కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలవనుంది. కాగా 3 వ వీకెండ్ లో అరడజను సినిమాలు ఉండటం తో రాజా ది గ్రేట్ ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here