రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ…రేటింగ్ కామన్ ఆడియన్స్ టాక్

0
3007

        బెంగాల్ టైగర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ఒక్క సినిమా కూడా చేయకుండా తన లుక్ ని మొత్తం మార్చేసుకుని ఇప్పుడు సరికొత్త లుక్ తో వచ్చేశాడు. పటాస్.. సుప్రీమ్ లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అనిల్ రావిపూడి రాసుకున్న బ్లైండ్ హీరో కథ చాలామంది స్టార్ హీరోల దగ్గరకి వెళ్ళగా వాళ్ళు ఒప్పుకోకపోవడం తో ఆ కథలో మార్పులు చేసి రవితేజ కి వినిపించడం ఒప్పించడం చేసేయడం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం జరిగింది.

మరి సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ…కథ ఇది వరకు కనుపాప అనే డబ్బింగ్ సినిమా చూసిన వాళ్ళకి ఇట్టే తెలిసి పోతుంది… కానీ ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఓ రేంజ్ లో వాడు కున్నాడు డైరెక్టర్ అనిల్ రావి పూడి.

హీరోయిన్ ని హీరో సేఫ్ చెయ్యడం అనేది సింగిల్ లైన్ స్టొరీ కానీ ఇక్కడ హీరో కి కళ్ళు కనిపించవ్… అలాంటి హీరో ఎలా హీరోయిన్ ను సేఫ్ చేశాడు అన్నది సినిమా కథ…. ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని మంచి కామెడీ సీన్స్ తో అలరించిన అనిల్ రావిపూడి ఫస్టాఫ్ మొత్తం కామెడీ సీన్స్ తో అలరించాడు.

మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సినిమా సీరియస్ గా వెళుతుంది అనే టైం లో గున్నా గున్నా మామిడి సాంగ్ సీన్స్ తో థియేటర్స్ షేక్ అయ్యేలా చేశాడు. తర్వాత కొంత స్లో అవుతూ సాగే సినిమా లో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంటూ క్లైమాక్స్ లో మళ్ళీ ఫైట్స్ తో ఎండ్ అయ్యేలా చేశాడు.

కళ్ళు కనిపించని వ్యక్తికి దృష్టి కోణం అద్బుతంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్…హీరో క్యారెక్టర్ ఇదే కోణంలో ఉండటం యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇది హీరో విపరీతంగా వాడటం కొన్ని సమయాల్లో అద్బుతం అనిపించినా కొన్ని సార్లు ఓవర్ అవుతుందా అనిపిస్తుంది.

అది పట్టించుకోకుండా సినిమా ని చూస్తె మాత్రం రవితేజ అలాంటి రోల్ లో అదరగొట్టిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మెహ్రీన్ మరోసారి తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు కొంతవరకు ఆకట్టుకున్నారు.

కామెడీ ఎపిసోడ్స్ ఫస్టాఫ్ లో అక్కడక్కడ హిలేరియస్ గా ఉండగా సెకెండ్ ఆఫ్ లో ఒకటి రెండు ఎపిసోడ్స్ కి రెస్పాన్స్ పీక్స్ అని చెప్పొచ్చు. ఇక మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పనులను సక్రమంగా నిర్వర్తించారు.

ఇక సంగీతం విషయానికి వస్తే సాయికార్తిక్ అందించిన పాటలు యావరేజ్ గా ఉండగా విజువల్స్ బాగున్నా సాంగ్స్ ఇంకాస్త బాగుంటే బాగుండు అనిపించింది….ఇక నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా సినిమా అంతా ఫుల్ కలర్ ఫుల్ గా కనిపించింది అని చెప్పొచ్చు.

అనిల్ రావి పూడి కొత్త కథను రాయకున్నా కొన్ని సినిమాలను ప్రేరణగా తీసుకుని సరికొత్త ప్రయోగం చేయకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు. సెకెండ్ ఆఫ్ లో స్లో అవ్వకుండా చూసుకుని ఉంటె మరింత బాగుండేదని అనిపించింది. ఓవరాల్ గా అనిల్ రావిపూడి డైరెక్టర్ గా హాట్రిక్ కొట్టినట్లే అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా దీపావళి సెలవుల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు..కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఫ్యూ నుండి ఈ సినిమా కి మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…మీరు చూసి ఉంటె ఎలా అనిపించిందో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here