రాజుగారిగది 2 మూవీ రివ్యూ & రేటింగ్…కామన్ ఆడియన్స్ టాక్

1
3180

      2015 లో దసరా సర్ప్రైజ్ విన్నర్ గా నిలిచిన రాజుగారిగది అనే చిన్న సినిమా ఆ సినిమాను కొన్న వాళ్ళందరికీ అల్టిమేట్ లాభాలను తెచ్చి పెట్టింది. కాగా అలాంటి సినిమా కి సీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. డానికి తోడూ ఈ సారి స్టార్ కాస్ట్ పెరిగి నాగార్జున అండ్ సమంత లాంటి స్టార్స్ నటిస్తుండటం తో ట్రేడ్ లోనూ అంచనాలను పెంచేసిన రాజుగారిగది 2 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు భారీగానే వచ్చేసింది.

మరి సినిమా ఎలా ఉంది అంటే…ముందు కథ ఎంటో ట్రైలర్ లోనే చూయించారు…ఓరిసార్ట్ కి వెళ్ళిన ఫ్రెండ్స్ కి అనుకోకుండా ఓ ఆత్మ భయపెడుతూ ఉంటుంది. ఆ ఆత్మ తమ వెంటే ఎందుకు పడుతుంది అని ఓ మెంటలిస్ట్(నాగార్జున) దగ్గరకు వెళ్ళగా ఆ ఆత్మ వీళ్ళ వెంట పడటానికి కారణాలు వెతికి ఆ ఆత్మకి ఎలా విముఖ్తిని కలిగించారో అదే సినిమా కథ.

కథ గా చెప్పుకుంటూ ప్రతీ హర్రర్ కామెడీ సినిమాలకు ఉండే కథనే అయినా ఇక్కడ నాగార్జున మరియు సమంత లు ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయకపోవడం తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి సినిమా మొత్తం కంటిన్యు అవుతుంది.

నాగార్జున మరియు సమంత లు సినిమాకు ఊపిరి పోశారు. ముఖ్యంగా సమంత సెకెండ్ ఆఫ్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకోగా నాగార్జున సినిమా మొత్తం భుజాన మోశాడు. మొదటి అర్ధభాగంలో వెన్నెల కిషోర్, శకలక శంకర్ మరియు ప్రవీణ్ కొంత కామెడీ తో ఆకట్టుకున్నారు. సీరత్ కపూర్ ని ఎందుకు తీసుకున్నారో అందుకు కొంతవరకు న్యాయం చేసింది.

తమన్ సినిమాకి మంచి సాంగ్స్ ఇవ్వడమే కాకుండా ఫస్టాఫ్ మొత్తం భయపెట్టే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు. రెండు పాటలు అద్బుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ మరియు కొంత గ్రాఫిక్స్ వర్క్ అద్బుతంగా ఉందని చెప్పొచ్చు.

ఇక ఓంకార్ డైరెక్షన్ రాజుగారిగది కన్నా బెటర్ గా ఏమి లేకున్నా ఉన్నంతలో ఆ ఫ్లో ని మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ పనులు సక్రమంగా నిర్వర్తించగా నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయని చెప్పొచ్చు.

సినిమాను రాజుగారిగది మొదటి పార్ట్ తో పోల్చి చూస్తె(ఎందుకంటే సినిమాకు సీక్వెల్ అని పెట్టారు కాబట్టి) మొదటి పార్ట్ కి ఈ పార్ట్ కి ఏమాత్రం సంభందం లేదు… మొదటి పార్ట్ లో హర్రర్ కామెడీ ని నమ్ముకుంటే..ఇక్కడ మొదటి అర్ధభాగం వరకే అది కొనసాగింది.

సెకెండ్ ఆఫ్ మొత్తం మంచి ఎమోషనల్ డ్రామా గా సాగగా అది ఫ్యామిలీస్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది…మొదటి అర్ధభాగం ముగిసిన తర్వాత హర్రర్, కామెడీ తగ్గడం కొంత నిరాశ కలిగించే అంశం అని చెప్పొచ్చు.

కానీ ఓవరాల్ గా మంచి సినిమాను చూసిన ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ నుండి బయటికి వస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి సెకెండ్ ఆఫ్ ఎక్కితే సినిమా అనుకున్న రేంజ్ కన్నా భారీ విజయం సొంతం చేసుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

అదే సమయంలో పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ కోరుకుని వచ్చే వాళ్ళు సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా కి కనెక్ట్ అయితే రిజల్ట్ కూడా అనుకున్న రేంజ్ లోనే ఉంటుంది. మొత్తం మీద సినిమాకి సీక్వెల్ అని పెట్టినా మొదటి పార్ట్ కి ఏమాత్రం టచ్ లేని కథ ఇది.

కామన్ ఆడియన్స్ కి సినిమాలో హార్రర్ కామెడీ తో ఎమోషనల్ ఎపిసోడ్ నచ్చితే సినిమా ఈ దీపావళికి దుమ్ము లేపడం ఖాయం…మేము సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here