రాజుగారిగది 2 ప్రీమియర్ షో రివ్యూ….మళ్ళీ కొట్టాడు

0
2939

   2015 దసరా కి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా రాజుగారిగది… చిన్న సినిమాల్లో అల్టిమేట్ లాభాలను తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచిన ఆ సినిమా కి సీక్వెల్ గా రాజుగారిగది 2 ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చేసింది. ఈస్ట్ కంట్రీస్ లో 6 గంటల నుండే స్పెషల్ షోల తో మొదలైన రాజుగారిగది 2 సినిమా కి అక్కడి నుండి వస్తున్న టాక్ ఎలా ఉందీ అంటే మరీ భీభత్సం కాకున్నా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది.

హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఫస్టాఫ్ హర్రర్ కామెడీ తో అలరించగా సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం స్లో గా మొదలు అయిన సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో రక్తి కట్టి ప్రీ క్లైమాక్స్ వరకు అద్బుతంగా సాగిందని… అక్కడ కొద్దిగా స్లో అయినా మళ్ళీ క్లైమాక్స్ లో సినిమా ఆకట్టుకుందని అంటున్నారు.

నాగార్జున మరియు సమంత ఇద్దరు సినిమాకు వెన్నముకగా నిలిస్తే వెన్నెల కిషోర్, శకలక శంకర్ మరియు ప్రవీణ్ ల కామెడీ ఆకట్టుకుందని అంటున్నారు. సినిమా ఓవరాల్ గా మరీ అద్బుతంగా లేకున్నా మొదటి పార్ట్ కి ఈక్వల్ లెవల్ లో ఉందని చూసినవాళ్ళు చెబుతుండటం విశేషం.

ఈ టాక్ తో ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకి కూడా ఇదే టాక్ ని సొంతం చేసుకుంటే మొదటి పార్ట్ లానే ఇదీ గట్టిగానే కొట్టే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here