వీకెండ్ రాజుగారిగది 2 కలెక్షన్స్…కుమ్మి కుమ్మి దంచేశాడు నాగార్జున

0
1321

  బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పాజిటివ్ టాక్ పవర్ ఏంటో తెలిసొచ్చింది. మరీ అంచనాలు పీక్స్ లో లేకున్నా మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడం తో రెండో పార్ట్ పై అంచనాలు పెరగడం దానికి తోడూ స్టార్స్ అయిన నాగార్జున మరియు సమంతలు ముఖ్య భూమిక పోషించడం తో ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజుగారిగది 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ అద్బుతమైన వసూళ్లు సాధించింది.

నైజాంలో 4.2 కోట్లు, సీడెడ్ లో 1.2 కోట్లు… టోటల్ ఆంధ్రా లో 4.6 కోట్ల షేర్ ని అందుకున్న రాజుగారిగది 2 మొత్తంగా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.2 కోట్ల షేర్ తో దీపావళి వీకెండ్ స్టార్ట్ కాక ముందే దుమ్ము లేపే వసూళ్ళ తో భీభత్సం సృష్టించింది.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ ఓవర్సీస్ మొత్తం కలిపి 2 కోట్ల మేర వసూళ్లు రాబట్టిన ఈ సినిమా టోటల్ గా 12.2 కోట్ల షేర్ తో వీకెండ్ ని అద్బుతంగా ముగించి ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం వెనక్కి తీసుకువచ్చింది. ఇక మిగిలిన సగం దీపావళి వీకెండ్ ముగిసే లోపు రావడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here