480 రోజులు….రామ్ చరణ్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే

0
1161

  సినిమా మీద పాషన్ కావొచ్చు…ఇష్టం కావొచ్చు…కొందరు యాక్టర్స్ ఎంతటి కష్టానికి అయినా వెనకాడరు… మరికొన్ని విషయాలు చూడటానికి పెద్దవిగా అనిపించక పోయినా అవి చేస్తున్నప్పుడు కలిగే కష్టాలు వాళ్ళకి బాగా తెలుసు…టాలీవుడ్ హీరోలలో ఇది వరకు ఈ పని ఎంతమంది చేశారో తెలియదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమారు 365 రోజులుగా ఒక పనిని కంటిన్యుగా చేస్తూనే ఉన్నాడు. ఆ పని పెద్ద కష్టం కాదు కానీ ఇన్ని రోజులు చేయడం ఇక్కడ గొప్ప…

ఆ పని మరెంటో కాదు…గడ్డం పెంచడం….వినడానికి సింపుల్ గానే అనిపించినా నెలలకు నెలలు ఈ పని చేయడం అంటే ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు. 2016 ఇయర్ ఎండింగ్ లో ధృవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదలైన ఈ గడ్డం పెంచడం రామ్ చరణ్ కొనసాగించాడు.

అది రంగస్థలం సినిమా కోసం అని అందరికీ తెలిసిందే..2017 లోనే రావాల్సిన ఈ సినిమా తిరిగి పోస్ట్ పోన్ అయ్యి మార్చి29 న రాబోతుంది…అంటే సుమారు 480 రోజుల పాటు రామ్ చరణ్ గడ్డంతో ఉండనున్నాడు…ఇది పెద్ద కష్టమయిన పని కాకున్నా సినిమాపై ఇన్ని రోజులు ఇలా ఉండటం చాలా పెద్ద విషయం అని చెప్పాలి…మీరేమంటారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here