ఇండస్ట్రీ రికార్డుల వేట జనవరి 10 నుండి!!…కాచుకోండి ఇక!!

0
1571

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. టోటల్ రన్ లో ఎవ్వరి ఊహకలకు అందని విధంగా ఏకంగా 127.3 కోట్ల షేర్ ని సాధించి ఆల్ టైం హిస్టారికల్ హిట్ గా నిలిచిన రంగస్థలం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ బోయపాటి తో అన్న విషయం తెలిసిందే..

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా పేరున్న బోయపాటి తో సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుంది. కాగా రీసెంట్ గా షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కాగా ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫైనల్ అయిందని అంటున్నారు. జనవరి 10 న సినిమాను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. రంగస్థలం తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి తో సినిమాతో ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here