ఈ డేట్ పక్కా…..మెగా ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!

0
336

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇక సినిమా ఫస్ట్ లుక్ ని ముందుగా వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా ఎందుకనో అలా జరగలేదు… దాంతో ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఈ దసరా రోజున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సంక్రాంతి కి ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here