రామ్ చరణ్ కి ఈ టైటిల్ ఏంటి సామి…అంతా షాక్!

0
2143

మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు…రీసెంట్ గా రంగస్థలం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సరికొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది అందరిలోనూ చాలా రోజులుగా ఉన్న ఉత్కంట అని చెప్పొచ్చు….రాజ వంశస్థుడు, రాజా మార్తాండ, జగదేకవీరుడు, స్టేట్ రౌడీ ఇలా కొన్ని పేర్లు వినిపించినా అవేవీ ఫైనల్ కాలేదట.

ఇప్పుడు వినిపిస్తున్న పేరు మాత్రం అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఉంది…ఆ టైటిలే “వినయ విధేయ రామా”…జయజానకినాయక లాంటి డిఫెరెంట్ టైటిల్ తర్వాత మరోసారి బోయపాటి పెట్టిన డిఫెరెంట్ టైటిల్ ఇదే అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది దసరా కి రిలీజ్ అయ్యే ఫస్ట్ లుక్ తో క్లియర్ కానుంది…

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here