ఇదేమి షాక్ సామి…300 మందితో మహా యుద్ధం!

0
2222

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమాలో 100 మందితో చేసిన యుద్ధం సినిమా కి ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఆ యుద్ధం కూడా కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ చేత అలాంటి యుద్ధమే చేయించాడట బోయపాటి శ్రీను…రామ్ చరణ్ బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాలో ఓ హై ఒల్టేజ్ ఎమోషనల్ ఫైట్ సీన్ ఒకటి ఉందట.

తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏకంగా 300 మంది గూండాలతో రామ్ చరణ్ యుద్ధం చేయాల్సి వస్తుందట. దాదాపు 11 నిమిషాల లెంత్ ఉండే ఈ ఫైట్ సీన్ రోమాలు నిక్కబోర్చేలా చేస్తుంది అనేది యూనిట్ వర్గాల సమాచారం. దాంతో ఈ సినిమా మగధీర లో 100 మంది ఫైట్ సీన్ ని మరిపిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here