ఆ 8 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమట..కాచుకోండి ఇక

0
2622

రంగస్థలం సినిమా తో టాలీవుడ్ లో రికార్డులనన్నీ బ్రేక్ చేసి సంచలన ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా కూడా ఒకేసారి 10 మెట్లు ఎక్కేశాడు. ఇక ఇప్పుడు వరుసగా చేసిన రెండు ప్రయోగాల తర్వాత ఊరమాస్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ డైరెక్టర్స్ లో మాస్ ని అలరించేలా అల్టిమేట్ ఫైట్స్ ని తెరకెక్కించే దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ కాబోతుంది. ఇక ఆ సినిమా లో కూడా హై ఓల్టేజ్ ఫైట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఓ 8 నిమిషాల ఫైట్ సీన్ కి మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ ఫైట్ లో సైకిల్ చైన్ తో రామ్ చరణ్ చేసే ఫైట్ మాములుగా ఉండదని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను ఈ సారి రామ్ చరణ్ తో ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here