ఇదేమి టైటిల్ సామి…ఫ్యాన్స్ కి మళ్ళీ పూనకాలే!!

0
2101

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా తో చరిత్రకెక్కె విజయం సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంగా ఉన్నాడు. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని కూడా మొదలు పెట్టగా ఈ సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశమే ఎక్కువ గా ఉంది అనేది ఇండస్ట్రీ వర్గాలలో  ఎక్కువ వినిపిస్తున్న టాక్.

ఇక సినిమా కి టైటిల్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అంటున్నారు ఇండస్ట్రీ లో…ఆ వార్తల ప్రకారం సినిమాకి “జగదేకవీరుడు” అనే టైటిల్ ని అనుకుంటున్నారని ఇదే ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

బోయపాటి రీసెంట్ గా సరికొత్త టైటిల్ ని తన సినిమాలకు పెట్టడం మొదలు పెట్టాడు, జయజానకినాయక అంటూ సరికొత్త టైటిల్ పెట్టినా మాస్ ఎలిమెంట్స్ ని మిస్ కానియ్యని బోయపాటి ఇప్పుడు “జగదేకవీరుడు” అనే టైటిల్ పెట్టినా కానీ మాస్ ఎలిమెంట్స్ కి కొదవ లేకుండా చూసుకో బోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here