ఈ న్యూస్ నిజం అయితే ఇండస్ట్రీ రికార్డ్ మెగాపవర్ స్టార్ దే!!

0
4232

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 1 ఇయర్ కావొస్తుంది. రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా థియేటర్స్ లో అడుగు పెడుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నత్తనడకన జరుగుతూ ఉంటె సినిమా రిలీజ్ డేట్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చే సమ్మర్ కి రానుంది.

కాగా సినిమా బిజినెస్ ఇప్పటి నుండే జోరు చూపుగా శాటిలైట్ రైట్స్ పరంగా దిమ్మతిరిగే రేటు ఆఫర్ ని దక్కించుకుందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఆ వార్తా కనుక నిజం అయితే నాన్ బాహుబలి రికార్డ్ రామ్ చరణ్ దే అని చెప్పాలి.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాకి శాటిలైట్ రైట్స్ పరంగా ఏకంగా 18 కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కానీ నిర్మాతలు ఇంకా ఆఫర్ ని ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. కాగా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ లుక్ జనవరి 1న రిలీజ్ అయ్యే చాన్స్ ఉందని టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here