రామ్ ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ..రేటింగ్…కామన్ ఆడియన్స్ టాక్

0
2656

      కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఒక హిట్ రెండు ఫ్లాఫ్స్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ హీరో రామ్ కి కందిరీగ తర్వాత మళ్ళీ మంచి విజయం దక్కడానికి చాలా సమయమే పట్టింది. 2016 లో నేనుశైలజ సినిమాతో ఆ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ మళ్ళీ కమర్షియల్ బాట పట్టి హైపర్ తో మరో ఫ్లాఫ్ ని తన సొంతం చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో తనకి నేనుశైలజతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు రామ్.

కిషోర్ తిరమానే దర్శకత్వంలో రామ్, అనుపమ పరమేశ్వర్ మరియు లావణ్య త్రిపాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది… పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

లైఫ్ లో స్నేహం ప్రేమ ఎంత ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుందో చెప్పే సినిమా ఉన్నది ఒకటే జిందగీ…. సినిమా మొదలవ్వడం స్లో గా మొదలైనా 30 నిమిషాల తర్వాత సినిమా లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు దర్శకుడు కిషోర్ తిరమానే…అప్పటి నుండి సినిమా వెంటాడుతుంది.

హృదయానికి హత్తుకునే సన్నివేశాలను ఎన్నో రాసుకున్నాడు దర్శకుడు…ఆ సీన్స్ ని ఎంతో హృదయంగా తెరకెక్కించాడు కూడా…రామ్ మంచి నటనతో ఆకట్టుకోగా సరికొత్త లుక్ మాత్రం పెద్దగా కిక్ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అది రామ్ కి అక్కడక్కడా సూట్ అవ్వలేదు అనిపిస్తుంది.

ఇక హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వర్ మెప్పించగా లావణ్య త్రిపాటి ఓకే అనిపించుకుంది. మిగిలిన పాత్రల్లో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పనులను సక్రమంగా నిర్వర్తించారు అని చెప్పొచ్చు.

సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ ని మరోసారి నిరూపించుకున్నాడు. మూడు మంచి సాంగ్స్ అందించిన దేవి సినిమాకు మంచి ఫీల్ ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు వెన్నెముకగా నిలిచి ఆకట్టుకున్నాడు.

నిర్మాణ విలువలు అద్బుతంగా ఉండగా మిగిలిన సాంకేతిక వర్గాల పనితీరు కూడా బాగా ఉంది. కాగా దర్శకుడు కిషోర్ తిరమానే ఈ సినిమాను మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంలో సఫలం అయ్యాడు. ప్రేక్షకుడు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాక సినిమా నుండి బయటికి రాలేరు.

కానీ ఇలాంటి సినిమాలను యూత్ మరియు కమర్షియల్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారో అనేదానిపై సినిమా విజయావకాశాలు ఆదారపడి ఉన్నాయి. మంచి ఫీల్ ఉన్న సినిమాలు ఇష్టపడే వాళ్లకి సినిమా అద్బుతంగా అనిపిస్తుంది.

కమర్షియల్ మూవీస్, కామెడీ కోరుకునే వాళ్లకి సినిమా ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి. మొత్తంమీద సినిమా కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసి 3 స్టార్స్ ఇస్తున్నాం…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here