ఉన్నది ఒకటే జిందగీ టోటల్ కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

0
1424

  ఒక హిట్ రెండు ఫ్లాఫ్స్ గా కెరీర్ ని సాగిస్తున్న హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్…. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రామ్ కి కెరీర్ డౌన్ అయినప్పుడల్లా ఓ సూపర్ హిట్ సినిమా ఆదుకునేది… 2016 ఇయర్ కి ముందు వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న రామ్ కి నేను శైలజ సినిమా తిరిగి ఊపిరి పోసి నికార్సయిన బ్లాక్ బస్టర్ సొంతం అయ్యేలా చేసి తిరిగి గాడిలో పడేలా చేసింది.

కానీ తర్వాత చేసిన సినిమా హైపర్ మళ్ళీ నిరాశని మిగిలించగా తనకి నేను శైలజ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ కి ఆ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు.

ఓవరాల్ గా 20 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా టోటల్ గా 20.5 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 21.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఉన్నది ఒకటే జిందగీ టోటల్ గా 18.9 కోట్ల షేర్ ని అందుకుని క్లీన్ హిట్ కి 2.6 కోట్ల దూరంలో ఆగిపోయింది. కానీ టూ క్లాస్ మూవీ తో ఆల్ మోస్ట్ 19 కోట్లు అంటే రామ్ మార్కెట్ పెరిగినట్లే కానీ సినిమా బార్డర్ ని కూడా క్రాస్ చేసి ఉంటే బాగుండేది అనేది విశ్లేషకుల వాదన..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here