రంగస్థలం 1985 ఆడియో రైట్స్ రేటు…మెగా ఫ్యాన్స్ కి పూనకాలే

0
540

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రంగస్థలం 1985 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ముందు 2017 లోనే అనుకున్నా అనుకోకుండా పోస్ట్ పోన్ అవుతూ 2018 మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కానీ సినిమా బిజినెస్ విషయంలో మాత్రం ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేస్తుంది.

కాగా సినిమా ఆడియో రైట్స్ హక్కులు మెగా హీరోల కెరీర్ లో రికార్డ్ ధరకి అమ్ముడు పోయినట్లు ఇప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి…పవన్ త్రివిక్రమ్ ల సినిమా ఆడియో రైట్స్ ఇంకా సేల్ కాలేదు కానీ ఆ సినిమాకి కూడా రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

ఇక రంగస్థలం 1985 సినిమా ఆడియో హక్కులు లహరి మ్యూజిక్ వారు ఏకంగా 1.62 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం…ఇది మెగా హీరోల కెరీర్ లో ఇప్పుడు రికార్డ్ కాగా ఓవరాల్ గా టాప్ 5 ఆడియో రైట్స్ లో ఒకటిగా నిలవనుంది ఈ సినిమా…సుక్కు-దేవి-రామ్ చరణ్  ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here