రంగస్థలం నైజాం 18….చరణ్ కెరీర్ లో ఫస్ట్ టైం

0
811

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ తో తిరిగి ఫామ్ అందుకుని దూసుకు పోతున్నాడు. అప్పటి వరకు రొటీన్ మాస్ మూవీస్ చేసిన రామ్ చరణ్ ధృవతో రూట్ మార్చి క్లాస్ బాట పట్టాడు. కాగా ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న రేపెల్ల మూవీ మరింత క్లాస్ అటెంప్ట్ అని ఇండస్ట్రీ లో టాక్. కాగా ఈ క్లాస్ మూవీ తో రామ్ చరణ్ ఊరమాస్ రికార్డులు కొడుతు న్నాడని చెప్పొచ్చు.

టాలీవుడ్ మార్కెట్ ఎక్సాన్షణ్ జరగడంతో ఈ క్లాస్ సినిమాకు కూడా మాస్ ఏరియాల్లో ఓ రేంజ్ రేట్లు ఆఫర్ వస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ముందుగా సీడెడ్ నుండి 8 కోట్ల దాకా రేటు ఆఫర్ రాగా ఇప్పుడు నైజాం ఏరియా నుండి 18 కోట్లదాకా ఆఫర్స్ వస్తున్నట్లు ట్రేడ్ టాక్.

2018 సమ్మర్ కానుకగా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ సినిమాతో క్లాస్ లో రామ్ చరణ్ మరింతగా జోచ్చుకుపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ మరియు టీసర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here