రంగస్థలం@100 కోట్లు…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
4209

    ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో 100 కోట్ల మార్క్ ని అందు కోవడం పెద్ద కష్టం కాదు, మంచి యూనివర్సల్ కథ ని ఎంచు కుని ఈజీగా 100 కోట్ల మార్క్ ని అందు కునే అవ కాశం పుష్కలంగా ఉందని చెప్పోచ్చు. ఇక 100 కోట్ల బిజినెస్ అంటే ఒకప్పుడు అవురా అను కున్న టాలీవుడ్ కి బాహుబలి రాకా తో 100 కోట్లు అంటే ఉట్టి దే అన్న ఫీలింగ్ ని కలిగించింది అని చెప్పొచ్చు.

బాహుబలి తర్వాత ఎన్నో సినిమా లు 100 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి చేస్తున్నాయి…వాటి లో కొన్ని మాత్రమె ప్రీ రిలీజ్ బిజినెస్ ని దాటగలుగు తున్నాయి. 2017 ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఖైదీనంబర్ 150 ఈ ఫీట్ ని అందుకుంది.

కాగా 2017 మిగిలిన రోజుల్లో క్రేజీ మూవీస్ పెద్దగా లేవు కాబట్టి ఫోకస్ ఇప్పటి నుండే 2018 పై పడింది. 2018 స్టార్టింగ్ లోనే సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఇప్పటి నుండే భారీ హైప్ నడుమ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా బిజినెస్ రేంజ్ ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో జరుగుతుందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. సీడెడ్ లో 12 కోట్లు, నైజాం లో 20 కోట్లు, కర్ణాటక లో 9 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్లు…ఇలా ప్రతీ ఏరియాలో రామ్ చరణ కెరీర్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ నిఈ సినిమా సొంతం చేసుకుంటుందట.

ఇంకా రిలీజ్ కి చాలా సమయమే ఉన్నా ఇప్పటి నుండే సినిమా పై జోరుగా క్రేజ్ పెరుగుండటం తో సంక్రాంతి కి ఈ సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దృవతో సూపర్ సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ ఈ సినిమా తో ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here