అరుదైన రికార్డ్ కొట్టేసిన “తొలిప్రేమ” ఈ దశాబ్దం లో ఇదే రికార్డ్

0
4408

  తొలిప్రేమ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దుమ్ము లేపే వసూళ్ళతో దూసుకు పోతుంది. మంచి లవ్ స్టొరీ తో పాటు సెన్సిబుల్ కామెడీ కూడా ఉండటం సినిమాకి బాగా కలిసి రాగా వాలంటైన్స్ వీక్ అవ్వడం సినిమాకి మరింత కలిసి వచ్చింది. దాంతో కలెక్షన్స్ లో జోరు చూపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ఫిదా తర్వాత బెస్ట్ అనిపించుకుంటుంది.

కాగా సినిమా ఇక్కడ మరో రేర్ ఫీట్ ని కూడా సొంతం చేసుకోనుంది…అదేంటంటే… తెలుగు సినిమా హిస్టరీలో ఒకప్పుడు అదరగొట్టిన సినిమాల టైటిల్స్ ని ఈ మధ్య తిరిగి చాలా సినిమాలకు పెట్టారు. మాయాబజార్’.. ‘మరో చరిత్ర’.. ‘ఘర్షణ’.. ‘మౌనరాగం’.. ‘శంకరాభరణం’.. ఇలా చాలా సినిమాలు ఒరిజినల్ మూవీ రేంజ్ లో ఆడలేదు.

కానీ ‘మిస్సమ్మ’.. ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాలు మళ్ళీ హిట్స్ కొట్టిన అది 2000 నుండి 2010 లోపు వచ్చిన సినిమాలు..కానీ 2010 నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఎ సినిమా ఇలా హిట్ కాలేదు. కానీ పవన్ తొలిప్రేమ సినిమా టైటిల్ ని ఇప్పుడు వరుణ్ తేజ్ తన సినిమాకు పెట్టుకుని ఈ దశాబ్దంలో ఇలా హిట్ కొట్టిన మొదటి హీరో అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here