రవితేజ ||రాజా ది గ్రేట్|| 50 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా??

0
823

   మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ కంబ్యాక్ మూవీ రాజా ది గ్రేట్ దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే… బెంగాల్ టైగర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రవితేజ సరికొత్త లుక్ తో అలరించిన ఈ సినిమా రవితేజ కి తిరిగి కంబ్యాక్ గా నిలవడమే కాకుండా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గాను నిలిచి రవితేజ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో తెలిసేలా చేసింది.

ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల వేడుకను జరుపుకుంది ఈ సినిమా…రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 రోజులు అయినా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న రాజా ది గ్రేట్ మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 సెంటర్స్ లో 50 రోజుల వేడుక జరుపుకున్నట్లు సమాచారం…

అందులో 15 డైరెక్ట్ సెంటర్స్ కాగా మరో 7 షిఫ్ట్ సెంటర్స్ ఉన్నట్లు సమాచారం…ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ని అతి త్వరలో తెలియజేస్తాం… ఈ సినిమాతో మంచి కంబ్యాక్ సొంతం చేసుకున్న రవితేజ త్వరలోనే “టచ్ చేసి చూడు” సినిమాతో మరోసారి ప్రేక్షలుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here