మెగా ఫ్యాన్స్ నిరాశ…కారణం ఇదే!

0
1816

రంగస్థలం తో ఇండస్ట్రీ రికార్డుల ను తిరగరాసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ హిస్టరీ లోనే ఆ సినిమా తో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ బోయపాటి ల కాంబో లో వస్తున్న సినిమా కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.

కాగా రామ్ చరణ్ బోయపాటి ల సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని ముందుగా వినాయక చవితి కి రిలీజ్ చేస్తారని న్యూస్ వచ్చినా అది వట్టిదే అయింది… తర్వాత మరోసారి దసరా కి పక్కా గా సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తారు అన్నారు. 

కానీ దసరా కి కూడా ఇప్పటి వరకు టీం నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం తో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని టైటిల్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకంగా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here