మరో కొత్త అప్ డేట్….ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే

0
1164

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వినాయక చవితి నుండి కంటిన్యూ గా పోస్ట్ పోన్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం బోయపాటి శ్రీను సినిమాకి “వినయ విధేయ రామ” అంటూ…

క్లాస్ టైటిల్ పెట్టడంతో యూనిట్ లో మాస్ టైటిల్ పెట్టాలని కొందరు కాదు ఇదే టైటిల్ కథ కి యాప్ట్ అని బోయపాటి ల మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండటం వలన దశరాకీ రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ లుక్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు.

కానీ చివరికి బోయపాటి గెలిచాడని సినిమాకి ఆ టైటిల్ ఆల్ మోస్ట్ కంఫామ్ అని ఇక సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్ మెంట్ ని దీపావళి కి ఇవ్వబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇది నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి దీపావళి కి డబుల్ బొనాంజా అనే చెప్పాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here