RC12 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్…మెగా ఫ్యాన్స్ కి పూనకాలే ఇక

0
1182

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యమ జోరు మీదున్నాడు…మగధీరతో 75 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయినా తర్వాత చేసిన సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వకుండా స్టడీగా ఉన్న రామ్ చరణ్ రంగస్థలం సినిమా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుని ఏకంగా 127.5 కోట్ల షేర్ తో ఆల్ టైం రికార్డ్ ను అందుకున్నాడు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సరికొత్త సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 13 న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 2018 ని తన పేరిట లిఖించుకున్న రామ్ చరణ్ ఈ అప్ కమింగ్ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే, మరి ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here