టాలీవుడ్ బిగ్గీస్ మూవీస్ (థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్)

0
3445

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నా థియేటర్స్ సరిపడినన్ని మొదటి వీకెండ్ లో దక్కలేదు…ఇప్పుడు మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చి చూస్తె ఏ రేంజ్ రిలీజ్ దక్కిందో పెర్ఫెక్ట్ ఐడియా వస్తుంది అని చెప్పొచ్చు. ముందుగా ఎన్టీఆర్ జైలవకుశ సినిమా అన్ని ఏరియాలలో కలిపి సుమారు 1800 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక మహేష్ స్పైడర్ సినిమా 2400 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఏకంగా 3000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సుమారు 1650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను సినిమా ఓవరాల్ గా 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. రెండు రాష్ట్రాల్లో 1050 వరకు థియేటర్స్ వరకు రిలీజ్ అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన నా పేరు సూర్య కూడా రెండు రాష్ట్రాల్లో 1100 కి పైగా టోటల్ వరల్డ్ వైడ్ గా 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కానీ ఓపెనింగ్స్ పరంగా ఇతర పెద్ద సినిమాలతో పోల్చుకుంటే నా పేరు సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేక పోయింది. మరి ఇక మీదట రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు ఎంత రేంజ్ లో థియేటర్స్ దక్కుతాయి…ఎలాంటి ఓపెనింగ్స్ రికార్డులు వస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here