5 రోజుల్లో 420 కోట్లు+….దుమ్ములేచిపోయింది

0
771

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో టోటల్ గా 382.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా సినిమా 5 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కోగా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని ఓవరాల్ గా సాధించ గలిగింది ఈ సినిమా. అన్ని ఏరియాల్లో డ్రాప్స్ 50% రేంజ్ లో ఉండటం కొంత విచారకరమే అయినా.

ఓవరాల్ గా సినిమా 5 వ రోజు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కన్ఫాం చేసుకుంది. దాంతో టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు 420 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. బాహుబలి సిరీస్ తర్వాత ఈ మార్క్ అందుకున్న ఒకేఒక్క సినిమా 2.0.

అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉండగా సినిమా హిందీ లో కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుండటం విశేషం. తమిళ్ కలెక్షన్స్ మాత్రం అందరికీ ఒకింత షాక్ నే కలిగిస్తున్నాయి. ఎందుకనో ఒక్క చెన్నై తప్ప మిగిలిన ఏరియాల్లో సినిమా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక పోతుంది. ఓవరాల్ గా 420 కోట్ల తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here