4 రోజుల్లో 350 కోట్లు…సామి శిఖరం కాదు పర్వతం

0
1483

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు ఊచకోత కోసింది. అన్ని ఏరియాలలో అంచనాలకు మించి కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తూ దూసుకుపోతుంది. సినిమా 3 రోజుల్లో టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 265 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ ని మించాయని అంటున్నారు.

దాంతో నాలుగో రోజు కలెక్షన్స్ లెక్క తో రోబో 2.0 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గ్రాస్ కౌంట్ ఏకంగా 350 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి.

మొదటి రెండు రోజులు అండర్ పెర్ఫార్మ్ చేయడంతో అందరి లోను డౌట్స్ వచ్చినప్పటికీ వీకెండ్ లో సినిమా కనబరిచిన జోరు అదుర్స్ అనే చెప్పాలి. ఇంకా అన్ని ఏరియాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా ఫైనల్ గా వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here