ఇప్పటి దాకా ఒకలెక్క ఇప్పటి నుండి ఒకలెక్క…300 కోట్లు కావాలి!

0
1101

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 360 కోట్లు. అంటే గ్రాస్ పరంగా సినిమా టోటల్ గా 720 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాగా సినిమా మొదటి 4 రోజుల్లో 382.5 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపగా..

5 వ రోజు గ్రాస్ లెక్క 40 కోట్లకు పైగా ఉందని సమాచారం. దాంతో టోటల్ గ్రాస్ ఇప్పుడు 420 కోట్లకు పైగా ఉండటం తో సినిమా ఇప్పటి నుండి సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఒకెత్తు… ఇప్పటి నుండి సాధించబోయే కలెక్షన్స్ లెక్కలు మరో ఎత్తు అని చెప్పాలి.

బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి నుండి 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి అవసరం ఉంది. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే రోజు మినిమమ్ 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సెకెండ్ వీకెండ్ వరకు అందుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కూడా జోరు కొనసాగిస్తేనే సినిమా ఈ మార్క్ ని అందుకుంటుంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here