బాహుబలి 2 రికార్డ్ కొట్టని 2.0 ట్రైలర్

0
1431

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, కోలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ శంకర్ కాంబో కి తోడుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో కనిపిస్తున్న సెన్సేషనల్ మూవీ రోబో 2.0 సినిమా ఈ నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా 24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్నా ఒకింత షాక్ ఇచ్చే లా వ్యూస్ ని సొంతం చేసుకుంది.

మన బాహుబలి పార్ట్ 2 ట్రైలర్ తెలుగు వర్షన్ కె 21.7 మిలియన్ వ్యూస్ రాగా మిగిలిన భాషల్లో కలిపి 51 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. కానీ రోబో 2 ట్రైలర్ తమిళ్ వర్షన్ కి 7.8 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 68 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది.

ఇక హిందీ వర్షన్ 10.5 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 63 వేల లైక్స్ ని సాధించగా తెలుగు వర్షన్ 3.6 మిలియన్ వ్యూస్ ని 1 లక్షా 42 వేల లైక్స్ ని సాధించింది. టోటల్ గా అన్నీ భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 21.5 మిలియన్ వ్యూస్ 8 లక్షల 68 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి తెలుగు వర్షన్ ట్రైలర్ కన్నా కూడా అన్నీ వర్షన్స్ కలుపుకుని రోబో 2.0 ట్రైలర్ క్రాస్ చేయకపోవడం షాకింగ్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here