2.0 4 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

0
894

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ స్టార్ట్ ని సొంతం చేసుకున్న రోబో 2.0 మొదటి రెండు రోజులు కొద్దిగా కలెక్షన్స్ తగ్గినట్లు అనిపించినా వీకెండ్ మాత్రం సాలిడ్ గా ముగిసింది. ఒక్క నాలుగో రోజే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకి పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేయగా టోటల్ గా…117 కోట్ల గ్రాస్ ని అందుకుని అందరి అంచనాలను మించేసింది. ఇక సినిమా టోటల్ వీకెండ్ కలెక్షన్స్ ని ఏరియాల వారి గా ఒకసారి పరిశీలిస్తే…

తెలుగు వర్షన్ 33.7 కోట్లకు పైగా షేర్ తో 52 కోట్ల గ్రాస్ ని, తమిళ్ లో 57 కోట్ల గ్రాస్ ని, హిందీ లో 130 కోట్ల గ్రాస్ ని, కర్ణాటకలో లో 26 కోట్ల గ్రాస్ ని, కేరళలో 12.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ఇండియా లో 275.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

ఇక సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 107 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ లెక్క ఇప్పుడు 382.5 కోట్ల గ్రాస్ ని 193 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా కి అసలు సిసలు పరీక్ష 5 వ రోజు ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఈ రోజు ఓపెనింగ్స్ ని బట్టి 40 కోట్లకు పైగా గ్రాస్ కన్ఫాం అని చెప్పొచ్చు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here