అమ్మింది 6 కోట్లకు 3 రోజుల్లో వచ్చింది ఇది

0
206

కోలీవుడ్ హీరోలలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న స్టార్స్ లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు….అపరిచితుడు తర్వాత తమిళ్ అండ్ తెలుగు లో నికార్సాయిన హిట్ లేకపోవడంతో విక్రమ్ లేటెస్ట్ మూవీ పై పెద్దగా ఆసక్తి లేకపోయింది.

ఇలాంటి సమయంలో తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సామి సినిమా కి సీక్వెల్ అయిన సామి 2 తో రీసెంట్ గా తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ చేయగా సినిమా కి యావరేజ్ టాక్ దక్కింది. రొటీన్ పోలీస్ విలన్ అండ్ రివెంజ్ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కింది ఈ సినిమా.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో 6 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకున్న ఈ సినిమా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో మొత్తం మీద 1.2 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాల్లో సాధించింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా కె దక్కాయి అని చెప్పాలి. కానీ టాక్ బాగలేకపోవడంతో సినిమా కలెక్షన్స్ వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here