14 ఏళ్లుగా క్లీన్ హిట్ లేదు…అయినా 6 కోట్లతో రెచ్చిపోయిన విక్రమ్

0
381

కోలివుడ్ హీరోలలో తెలుగులో కూడా మార్కెట్ ఉన్న హీరోలలో విక్రం కూడా ఒకరు. తమిళ్ లో పాటు తెలుగు లో కూడా క్లీన్ హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు విక్రం. అప్పుడెప్పుడో అపరిచితుడు సినిమాతో 2005 లో హిట్ కొట్టాడు విక్రం.

మళ్ళీ ఇప్పటి వరకు ఒక క్లీన్ హిట్ కూడా తెలుగులో సొంతం చేసుకోలేక పోయాడు. ఇలాంటి సమయంలో తమిళ్ లో అపరిచితుడు తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచినా సామి సినిమా కి సీక్వెల్ గా సామి 2 ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు.

ఈ సినిమా తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కాగా తెలుగులో ఈ సినిమాకి ఏకంగా 6 కోట్ల రేటు దక్కినట్లు సమాచారం. ఇన్నేళ్ళుగా ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ 6 కోట్ల రేంజ్ బిజినెస్ అంటే గొప్పే అని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here