మెగా హీరోలకి నంది అవార్డ్ ఇవ్వకపోవడం పై సాయి ధరం తేజ్ ఏమన్నాడో తెలుసా??

0
1048

  రీసెంట్ గా జరిగిన నంది అవార్డుల విషయంలో జరిగిన రచ్చ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తమకి ఎందుకు అవార్డ్ ఇవ్వలేదు అంటూ ఒక్కొక్కరు మీడియా సాక్షి గా ఓపెన్ గా విమర్శల వెల్లువ కురిపించగా మెగా హీరోలకి 2002 తర్వాత ఇప్పటి వరకు నంది అవార్డులు ఎందుకని ఇవ్వలేదు అంటూ మెగా నిర్మాతలు ఒక్కొక్కరు చెప్పడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది…ఇది కొన్ని రోజుల చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన జవాన్ మూవీ ప్రమోషన్ పనుల్లో భాగంగా మీడియా పదే పదే నంది అవార్డుల పై, మెగా హీరోల కు నంది అవార్డులు రాకపోవడం పై పలు ప్రశ్నలు చేయగా వాటికి సాయి ధరం తేజ్ సమాదానం ఇచ్చాడు.

నేను నంది అవార్డుల పై మాట్లాడేంత అర్హత కలిగిన మనిషిని కాదు….ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఓనమాలు నేర్చుకుంటున్నాం అంటూ చెప్పగా మళ్ళీ ప్రశ్నల జడిగాన కురిపించగా అభిమానుల మరియు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే చాలని అవార్డులు ముఖ్యం కాదని చెప్పి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాడు సాయి ధరం తేజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here