జవాన్ ట్రైలర్ రివ్యూ…కామన్ ఆడియన్స్ టాక్!!

0
555

  మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ హీరో గా సుప్రీమ్ సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన తిక్క మరియు విన్నర్ సినిమాలు భారీ నిరాశ ని మిగిలించగా ఇప్పుడు రొటీన్ రూట్ లో కమర్షియల్ మూవీ చేయకుండా మరోసారి ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయిధరం తేజ్. టాలీవుడ్ బెస్ట్ స్టొరీ రైటర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న BVS రవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

సోషల్ మెసేజ్ తో వస్తున్న ఈ సినిమా లో కమర్షియల్ హంగులు కూడా ఉన్నప్పటి కీ సినిమా లో మెయిన్ స్టొరీ దేశ భక్తీ పై ఉండబోతుందని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. దాంతో పాటే హీరో మరియు విలన్ ల మైండ్ గేమ్ తో సాగే స్క్రీన్ ప్లే సినిమా లో ఉండొచ్చని ట్రైలర్ చూస్తె తెలుస్తుంది.

ట్రైలర్ కొత్తగా ఉండగా ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు ఈ మధ్య తెలుగు లో ప్రజాదరణ పొందలేదు..మరి ఈ ప్రయోగాత్మక సినిమాతో సాయిధరం తేజ్ అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటే మాత్రం హీరో గా మరో పెట్టు ఎక్కినట్లే అని చెప్పొచ్చు. కామన్ ఆడియన్స్ కూడా ఇదే విషయాన్నీ చెబుతుండటం తో డిసెంబర్ 1 న రాబోతున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ట్రైలర్ చూసి ఉంటే ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here