7 కోట్లకు అమ్మితే 4 డేస్ లో వచ్చింది ఇది!!

1
3391

ప్రేమ కథా చిత్రం తర్వాత సుధీర్ బాబు ఖాతాలో నికార్సయిన హిట్ పడలేదు…. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే సినిమాలు పడక కెరీర్ వెనకంజ వేసిన సమయంలో రీసెంట్ గా సమ్మోహనం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. రిలీజ్ అవ్వడమే పాజిటివ్ టాక్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కొద్దిగా స్లో అయినా తర్వాత పుంజుకుంది.

మొదటి రోజు 70 లక్షలు, రెండో రోజు 1.1 కోట్లు, మూడో రోజు 1.2 కోట్లు టోటల్ గా రెండు రాష్ట్రాల ఆవల 80 లక్షల షేర్ అందుకోగా టోటల్ గా 3.8 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక 4 వ రోజు వర్కింగ్ డే అయినా సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి టోటల్ గా 70 లక్షల వరకు షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ గా 4 రోజుల్లో 4.5 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కి 7 కోట్లు కలెక్ట్ చేయాలి…మరో 2.5 కోట్ల దూరంలో ఉన్న సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఈ లెక్క కి మరింత క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. టోటల్ రన్ లో కచ్చితంగా 10 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవడం ఖాయం అంటున్నారు. మరి మీరెంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here