“సప్తగిరిLLB” మూవీ రివ్యూ & రేటింగ్….

0
1582

    బాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా జాలీLLB… అర్షద్ వార్సీ హీరో గా వచ్చిన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని అందుకోగా తమిళ్ లో ఉదయనిది స్టాలిన్ రీమేక్ చేయగా అక్కడ మాత్రం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి సమయంలో తెలుగులో తన డిఫెరెంట్ కామెడీతో ఓ రేంజ్లో అలరిస్తూ హీరోగా ప్రయత్నిస్తున్న సప్తగిరి హీరోగా చేస్తున్న రెండో ప్రయత్నం…సప్తగిరిLLB…

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ….కథ చాలా సీరియస్ కథ… రోడ్డు పై తమ జీవితాలను వెళ్లదీసే వాళ్ళు చాలామంది ఉంటారు…వారికి అందరిలా ఆదార్ కార్డులు కానీ మారేవి ఉండవు…కానీ జీవితం అలా అలా గడిచిపోతుంది…

కానీ అనుకోకుండా ఓ బడా బిజినెస్ మాన్ కొడుకు ఫుల్లుగా తాగి కారు నడుపుతూ రోడ్డు మీద పడుకున్న వాళ్ళ మీద బండిని నడిపి వాళ్ళ చావుకు కారణం అవుతారు…పెద్ద లాయర్స్ హెల్ప్ తో బయటపడ్డ అతన్ని ఏమాత్రం అనుభవం లేని కుర్ర లాయర్ జీవితంలో ఎత్తుకు ఎదగాలి అనుకునే ఆ కుర్రలాయర్ ఎలా శిక్ష పడేలా చేశాడు అనేది సినిమా కథ…

హిందీ లో సీరియస్ గా సాగే కథ తెలుగు లో వచ్చే సరికి కమర్షియల్ హంగులను తొడుక్కుని కిచిడీ అయ్యింది…దాంతో మెసేజ్ ఓరియె౦టెడ్ మూవీ లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరమా అని ఒరిజినల్ వర్షన్ చూసినవాల్లకు అనిపించడం ఖాయమని చెప్పొచ్చు.

కానీ చూడని వాళ్లకి మాత్రం కొంతవరకు అది రిలీఫ్ గా అనిపిస్తూనే సప్తగిరి మరియు సాయి కుమార్ ల పెర్ఫార్మెన్స్ చూసి విజిల్స్ కొట్టాలి అనిపిస్తుంది..క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టు అని చెప్పొచ్చు. ఆ ఎపిసోడ్ విషయంలో మాత్రం ఒరిజినల్ వర్షన్ చూసినవాళ్లని కూడా కొంతవరకు ఇంప్రెస్ చేశారు సప్తగిరి మరియు సాయి కుమార్ లు.

యాక్టర్స్ అందరూ ఒరిజినల్ లో ఉన్న విధంగానే మెయిన్ సీన్స్ అన్నీ సేం దింపేసినా అది ఇక్కడ చూడని వాళ్ళే ఎక్కువ అవ్వడం ప్లస్ పాయింట్… సప్తగిరి నటుడిగా మరో మెట్టు ఎక్కే సినిమా అని చెప్పొచ్చు. ఇక సాయికుమార్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే…

సినిమా సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు…ఇక ప్రతీ ఫ్రేం రిచ్ ఉండటం విశేషం…మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు సక్రమంగా తమ పనులను నిర్వర్తించగా హీరోయిన్ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు చరణ్ లక్కకుల ఒరిజినల్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ కొంతమందికి నచ్చే చాన్స్ ఉంది.

మొత్తం మీద సినిమా ఒరిజినల్ లా సూపర్బ్ అనిపించే విధంగా లేకున్నా ఎ అంచనాలు లేకుండా వెళ్ళే వాళ్లకి చివర్లో థియేటర్ నుండి వచ్చే సమయంలో చిరునవ్వుతో తిరిగి రావడం ఖాయం…సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here