సర్కార్ డే 1 AP-TG కలెక్షన్స్….కెరీర్ బెస్ట్

0
764

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఓపెన్ అవ్వగా సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రెండు రాష్ట్రాలలో సాధించి సంచలనం సృష్టించింది. ఇది వరకు ఇక్కడ తెరీ 1.6 కోట్లు, అదిరింది 1.7 కోట్ల దాకా షేర్ ని అందుకుని సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా….

ఇప్పుడు సర్కార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇక్కడ రెండు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రేంజ్ లో సంచలన కలెక్షన్స్ ని సాధించింది. ఒకసారి ఏరియాల కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam : ₹0.8cr, Ceeded : ₹0.6cr, UA : ₹0.22cr, East : ₹0.17cr, West : ₹0.15cr, Krishna : ₹0.16cr, Guntur : ₹0.3cr, Nellore : ₹0.1cr, Total AP/TS Share : ₹2.5cr

ఇక టోటల్ గా రెండు రాష్ట్రాల గ్రాస్ 4.1 కోట్ల లోపు ఉన్నట్లు సమాచారం. మిగిలిన ఏరియాలలో కూడా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయం అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here