సర్కార్ డే 1 ఓపెనింగ్స్..రికార్డ్ బ్రేకింగ్

0
491

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో అన్ని ఏరియాల్లో జరగడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అల్టిమేట్ రికార్డులను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో కొన్ని ఏరియాల్లో ఫుల్స్ కొన్ని ఏరియాల్లో 60% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అయింది. మొత్తం మీద ఆక్యుపెన్సీ మాత్రం ఓవరాల్ గా 25% రేంజ్ లో టోటల్ గా ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ సాధిస్తే…

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవచ్చు. ఇక తమిళనాడు లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు. అక్కడ సినిమా మొదటి రోజు 14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చట. మరి రోజు ముగిసే సరికి ఈ లెక్క పెరుగుతుందో లేదో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here