సర్కార్ ప్రీమియర్ షో రివ్యూ హిట్టా-ఫట్టా

0
812

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున 3400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుంది, సినిమాకి అక్కడ మొదటి టాక్ ఏంటో కూడా తెలియ వచ్చింది. మరి ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టొరీ లైన్ టీసర్ లో చెప్పిందే అంటున్నారు. ఫారిన్ లో బిగ్ బిజినెస్ మాన్ అయిన హీరో ఓటు హక్కు కోసం ఇండియా రావడం, తన ఓటు వేరే వాళ్ళు వేసేయడం, హార్ట్ అయిన హీరో ఎలక్షన్ కమిషన్ తో తిరిగి ఎన్నికలు జరిగేలా చేయడం తర్వాత ఎం జరిగింది అన్నది కథ అంటున్నారు.

మొత్తం మీద కథ మొదటి అర్ధభాగం ఫ్యాన్స్ ని అలరించే సీన్స్ తో చాలా సీన్స్ వైస్ కుమ్మేసిందని, కానీ అంత గట్టిగా మురగదాస్ ఈ సారి రాసుకోలేక పోయారని అంటున్నారు. కానీ ఫస్టాఫ్ ఫ్యాన్స్ కి చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

కానీ సెకెండ్ ఆఫ్ కథ మొత్తం ఆశించిన మేర ఆకట్టుకోలేదని, సీన్స్ వైస్ బాగున్నా స్టొరీ వైస్… తుపాకి, కత్తి సినిమాలతో పోల్చితే అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే కాదని అంటున్నారు. కానీ సినిమా మొత్తాన్ని విజయ్ తన భుజాన మోషాడని అంటున్నారు.

యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ అని, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు. మొత్తం మీద సినిమా కి ఓవర్సీస్ లో ఎబో యావరేజ్ టు హిట్ టాక్ కి మధ్యలో సినిమా టాక్ ఉందని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here