సవ్యసాచి డే 2 కలెక్షన్స్…కొట్టాడు కానీ!!

0
612

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 4.24 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ మరీ అద్బుతం అనిపించే లెవల్ లో లేకపోయినా కానీ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. కాగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ 30% వరకు ఉండగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీ సుమారు 35% ని టచ్ చేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సవ్యసాచి సినిమా రెండో రోజు రెండు రాష్ట్రాలలో 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.

కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ 23 కోట్లు అవ్వడంతో సినిమా మరింతగా హోల్డ్ చేస్తుంది అనుకున్న ఒకింత నిరాశాని మిగిలించింది. కానీ దీపావళి వీకెండ్ వచ్చే వారం లో సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి రెండో రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here