అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…కెరీర్ బెస్ట్!

0
372

అక్కినేని నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సవ్య సాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిధ్ధం అవుతుంది. కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు వరల్డ్ వైడ్ గా 1050 థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే ఓపెన్ అవ్వగా అన్నీ ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. నైజాం లో ఇప్పటి వరకు 35% వరకు బుకింగ్స్ జరగగా ఆంధ్రా సీడెడ్ లలో 30% వరకు బుకింగ్స్ జరిగాయని సమాచారం.

ఇది కొన్ని ఏరియాల్లో నాగ చైతన్య లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు ని మించే విధంగా ఉండగా కొన్ని ఏరియాల్లో ఈక్వల్ లెవల్ లో ఉంది. ఇదే జోరు మొదటి షో సమయం వరకు కొనసాగే అవకాశాలు ఉండటం తో టాక్ బాగుంటే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here