సెన్సార్ రివ్యూ…సూపర్ హిట్!

0
983

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి నవంబర్ 2 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిధ్ధం అవుతుండగా సినిమా సెన్సార్ పనులను రెండు రోజుల ముందుగానే కంప్లీట్ చేసుకోగా యు/ఏ సెర్టిఫికేట్ ని సొంతం చేసుకున్నా ఈ సినిమా టాక్ ఎలా ఉంది అనేది అందరి లోనూ ఆసక్తి ని రేపుతున్న ప్రశ్న అని చెప్పాలి. కాగా సినిమా కి సెన్సార్ నుండి..

వినిపిస్తున్న టాక్ మిగిలిన పెద్ద సినిమాల మాదిరిగానే పాజిటివ్ గానే వచ్చింది అని చెప్పాలి. రెండు చేతుల్లోనూ సమాన బలం ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురైన ఒక సంఘటనని ఎలా ఎదిరించాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఓ కిడ్నాప్ సస్పెన్స్ డ్రామా గా చెప్పుకుంటున్నారు.

ఫస్టాఫ్ అంతా కథ ఎంటర్ టైనింగ్ గా సాగగా ఇంటర్వెల్ నుండి అసలు కథ నడుస్తుందని, సెకెండ్ ఆఫ్ అద్బుతమైన స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ సీన్స్ తో సినిమా మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు. నాగ చైతన్య నికార్సాయిన సత్తా ఈ సినిమా తో తెలియడం ఖాయమని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలి అంటే మరొక్క రోజు ఆగితే సరిపోతుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here