సవ్యసాచి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా

0
2634

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఇయర్ అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా అవ్వడం సామాన్య ప్రేక్షకుల లో కూడా ఈ సినిమా పై ఆసక్తి ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 1050 కి పైగా థియేటర్స్ లో సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుంది.

మరి అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ… కథ గురించి పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ రెండు చేతుల్లో సమాన బలం ఉన్న వ్యక్తీ కి అనుకోకుండా ఒక సమస్య వస్తే ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది అన్న విషయం అందరికీ తెలిసిందే.

అది మెయిన్ పాయింట్ అయితే సినిమా లో మరిన్ని కథలు ఉన్నాయని, అంటున్నారు. సినిమాలో నాగ చైతన్య యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా యాక్షన్ పరంగా అన్నీ సీన్స్ లో అద్బుతంగా నటించి మెప్పించాడు అని అంటున్నారు. హీరోయిన్ తో లవ్ ట్రాక్ అక్కడక్కడా బోర్ కొట్టింది అంటున్నారు.

మంచి పాయింట్ తో ఇంటర్వల్ వస్తుందని, సెకెండ్ ఆఫ్ హీరో విలన్ ల మైండ్ గేం తో సాగుతుందని, ఆసక్తి కరమైన స్క్రీన్ ప్లే చివరి వరకు ఉంటుందని అంటున్నారు. నాగ చైతన్య తర్వాత మాదవన్ చాలా వరకు ఆకట్టుకున్నాడని కానీ డబ్బింగ్ అంతగా సెట్ కాలేదని అనిపిస్తుంది అంటున్నారు.

మొత్తం మీద ఫస్టాఫ్ క్యారెక్టర్ల ఇంట్రోడాక్షన్ కి ఎక్కువ సమయం తీసుకోవడం, అసలు కథలో వెల్లడానికి సమయం పట్టడం, లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కకాపోవడం మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. అది తప్పితే మిగిలిన సినిమా మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారు. ఓవర్సీస్ నుండి సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.. ఇక రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here