నైజాం 2.5…సీడెడ్ 1…ఊచకోత కోసిన నాగ చైతన్య!

0
432

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి కలెక్షన్స్ పరంగా అంచనాలను కూడా మించేసింది…నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

నైజాం ఏరియాలో మొదటి రోజు ఈ సినిమా ఓవరాల్ గా 2.5 కోట్ల షేర్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక రాయలసీమ ఏరియాలో మొదటి రోజు 1 కోటి వరకు షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది శైలజా రెడ్డి అల్లుడు సినిమా.

ఈ రేంజ్ లో ఓపెన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమా ఓవరాల్ గా మొదటి రోజు లెక్క కూడా ఇప్పుడు 6.5 నుండి 7 కి పెరిగిందని సమాచారం…ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఇప్పుడు లెక్క 7.5 కోట్లకు పైగానే ఉంటుంది అనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా…ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు త్వరలోనే అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here