శైలజారెడ్డి అల్లుడు సెన్సార్ టాక్…స్టోరీలైన్ ఇదే!

0
1359

ప్రేమమ్ మరియి రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు హిట్స్ తర్వాత యుద్ధం శరణం సినిమాతో భారీ ఫ్లాఫ్ ని సొంతం చేసుకున్న నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ శైలజారెడ్డి అల్లుడు ఈ వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా ముగించుకుని తొలి టాక్ ఏంటో కూడా బయటికి వచ్చేసింది…పొగరుతో ఉండే అమ్మాయిని చూసి ఇష్టపడే హీరో ఆ అమ్మాయిని ఎలా తన ప్రేమలో పడేలా చేశాడు అన్నది ఒక పాయింట్ అయితే….

ఆ అమ్మాయికి మించి పొగరు ఉండే అత్తని ఎలా ఒప్పించాడు అన్నది సినిమా స్టోరీ లైన్ అని అంటున్నారు….ఫస్టాఫ్ అంతా కామెడీ అండ్ లవ్ యాంగిల్ లో ఉంటుందని, సెకెండ్ ఆఫ్ ఊరి బ్యాగ్ డ్రాప్ తో ఉంటూనే ప్రేక్షకులను అలరించే అన్నీ అంశాలు ఉంటాయని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

సినిమా మాత్రం చాలా బాగుందని చెబుతుండటంతో సెన్సార్ నుండి కూడా సినిమాకి మంచి టాక్ లభించినట్లు అయింది. ఇక సినిమాకి యు/ఏ సెర్టిఫికేట్ ని ఇచ్చారు సెన్సార్ వారు…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here