శైలజా రెడ్డి అల్లుడు ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో తెలుసా?

0
1516

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా అను ఎమాన్యుఎల్ హీరోయిన్ గా రమ్యకృష్ణ అత్త రోల్ లో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున 1050 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కి ఓవరాల్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది.

ఆ టాక్ ప్రకారం సినిమా కథ మరీ కొత్తదేమీ కాదని అంటున్నారు…నిజమేగా…అత్తా అల్లుళ్ళ స్టొరీ లలో కథ కొత్తగా ఉండదు, కథనం స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటే సరిపోతుంది..ఆ విషయంలో మాత్రం మారుతి చాలా సార్లు సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు శైలజా రెడ్డి అల్లుడు విషయంలో కూడా కథ అంత బలంగా లేకున్నా కామెడీ అండ్ స్క్రీన్ ప్లే తో చాలా వరకు ఆకట్టుకున్నాడట మారుతి, నాగచైతన్య మరియు అను ఎమాన్యుఎల్ సీన్స్ అలాగే రమ్యకృష్ణ తో సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయట.

ఫస్టాఫ్ రొటీన్ లవ్ స్టొరీ తో ఓకే అనిపించినా సెకెండ్ ఆఫ్ లో చాలా సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ అందరికీ నచ్చుతాయని అంటున్నారు. టోటల్ గా చెప్పాలి అంటే సినిమా బాగుంది కానీ భీభత్సం అయితే కాదని అంటున్నారు. మరి రెగ్యులర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here