నంది అవార్డ్ లపై షాకింగ్ నిర్ణయం….ఏం జరుగుతుందో మరి!!

0
950

  ఇండస్ట్రీ లో నంది అవార్డులపై వెల్లువెత్తిన విమర్శల జడివాన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తమకి రావాల్సిన అవార్డ్ వేరే వాళ్లకి వెళ్లిందని… ఏ అర్హత ఉందని అవార్డులు ఇచ్చారని తమకి ఎందుకు ఇవ్వలేదని కొందరు విమర్శల జడివాన కురిపించగా ప్రతి విమర్శలు కూడా భారీ ఎత్తుగానే రాగా అది చిలికి చిలికి ప్రభుత్వమే కావాలని చేసింది అనే దాకా వెళ్ళడం తో ఇప్పుడు ఇండస్ట్రీ లో ఓ కొత్త వార్తా చక్కర్లు కొడుతుంది.

నంది అవార్డులపై జరిగిన రగడ చూసి అసలు ఈ నంది అవార్డులనే ఆపేయాలనే నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తా చక్కర్లు కొడుతుంది. ఇది చాలామంది కి షాకింగ్ గా అనిపించక మానదు అని చెప్పొచ్చు. ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డులను ఆపేయడం మంచిది కాదని కొందరు అంటున్నారు.

సమస్య నంది అవార్డులలో లేదని…అది ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన జ్యూరీ కమిటీలో ఉందని…వాటిని సరిదిద్ది ఇకమీదట తప్పులు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో మరింత రచ్చ జరుగుతుందా…లేదా ఏదైనా పరిష్కారం వెతుకుతారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ప్రశ్న…మరి మీరు ఏమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here